భారతదేశం, జూలై 31 -- వర్షాకాలపు మేఘాలు కమ్మేసిన ఆకాశం మన మనసును కూడా భారంగా మార్చేస్తుంది. అంటే మనల్ని దిగులు పరుస్తుంది. మనం అప్పుడప్పుడు కొన్ని కఠినమైన నిజాల గురించి మాట్లాడటానికి ఇష్టపడం. వర్షాకాలాన్ని మనం కవితాత్మకంగా చూస్తాం. గాలి, మట్టి వాసన, వాన చినుకుల గురించి ఎన్నో పాటలు, కవితలు రాసుకుంటాం. కానీ ఇదంతా పైపైన కనిపించే అందమైన చిత్రం మాత్రమే. లోపల మాత్రం, వర్షాకాలం మనకు తెలియకుండానే సీజనల్ యాంగ్జైటీని తెస్తుంది.

ముంబై బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ క్లినికల్ సైకాలజిస్ట్, సైకోథెరపిస్ట్ నరేంద్ర కింగర్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌తో మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో చాలా మంది ఆందోళనకు గురవుతున్నారని, కొందరికైతే యాంగ్జైటీ అటాక్స్‌ కూడా వస్తున్నాయని చెప్పారు.

"ఈ సీజన్‌లో చాలా మందిలో ఏదో తెలియని అశాంతి, మూడ్ అటుఇటు మారడం, ఒక్కోసారి యాం...