భారతదేశం, సెప్టెంబర్ 17 -- రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని, పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే ఆరోగ్య శ్రీ సేవలను పునరుద్ధరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రైవేట్ ఆసుపత్రులకు విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ ఈ సమస్యను పరిష్కరించడానికి ఆసుపత్రి యాజమాన్యాలతో నిరంతరం సంప్రదిస్తున్నారని అన్నారు.

ఈ సేవలను నిలిపివేయడం వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మానవతా దృక్పథంతో ఆసుపత్రులు తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. ఈ పథకం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతను మంత్రి నొక్కిచెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స పరిమితిని రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. గత 21 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభు...