Hyderabad, జూన్ 26 -- తెలుగులో థ్రిల్లర్ వెబ్ సిరీస్ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ శుక్రవారం (జూన్ 27) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న విషయం తెలుసు కదా. అయితే దీని ఒరిజినల్ కథ తమదని ఈటీవీ విన్ వాదిస్తోంది. ఇప్పటికే మూవీ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ దీనిపై న్యాయపోరాటం చేస్తున్నట్లు చెప్పాడు. ఇక తాజాగా ఈటీవీ విన్ ఓటీటీ చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది.

నిజానికి ఈటీవీ విన్ కానిస్టేబుల్ కనకం అనే వెబ్ సిరీస్ ను చాలా రోజుల కిందటే అనౌన్స్ చేసింది. ఇప్పుడు జీ5 ఓటీటీలో వస్తున్న విరాటపాలెం కథ తమదే అని ఆ ఓటీటీ వాదిస్తోంది. తాజాగా తమదే ఒరిజినల్ గన్ అని, మిగిలినవి దీపావళి డమ్మీ గన్స్ అంటూ పోస్ట్ చేసింది. అంతేకాదు త్వరలోనే తమ కానిస్టేబుల్ కనకం రాబోతుందని కూడా వెల్లడించింది.

"కానిస్టేబుల్ కనకం ఒరిజినల్ లైసెన్స్‌డ్ గన్ కేవలం ఈటీవీ విన్ దగ్గరే ఉంద...