భారతదేశం, జూన్ 28 -- జావెలిన్ త్రో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు భారత సంచలనం నీరజ్ చోప్రా. జులై 5న బెంగళూరులో జరగనున్న ప్రారంభ ఎన్సీ క్లాసిక్‌ ఈవెంట్ లో అతను పాల్గొంటాడు. నీరజ్ ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్నాడు. 90 మీటర్ల మార్కును కూడా అధిగమించాడు. రాబోయే ఎన్సీ క్లాసిక్‌కు ముందు.. స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో నీరజ్‌ను మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఇంటర్వ్యూలో జావెలిన్ త్రోలో పరుగు వేగం చాలా ముఖ్యమైనదని వెల్లడించిన సిద్ధు ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. జావెలిన్ త్రోయర్‌గా విజయం సాధించగల ఇండియన్ క్రికెటర్ పేరు చెప్పమని నీరజ్ చోప్రా ను సిద్ధు అడిగాడు. టోక్యో ఒలింపిక్స్ 2020 లో గోల్డ్ గెలిచిన నీరజ్ చోప్రా.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి వారిని తిరస్కరించి జస్ప్రీత్ బుమ్రా...