భారతదేశం, మే 10 -- పల్నాడు జిల్లా మానుకొండవారిపాలెంలో మాజీ మంత్రి విడదల రజిని, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. విడదల రజిని అనుచరుల్లో ఒకరైన శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేసే క్రమంలో...ఘర్షణ తలెత్తింది. శ్రీకాంత్ ను ఎందుకు అరెస్టు చేస్తు్న్నారని మాజీ మంత్రి రజిని పోలీసులను ప్రశ్నించారు. ఓ దశలో పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు మాజీ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసులు దౌర్జన్యం చేశారని వైసీపీ ఆరోపిస్తుంది. పల్నాడు జిల్లా మానుకొండవారి పాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు విడదల రజిని తన అనుచరులతో కలిసి వెళ్లారు. అయితే అక్కడకు పోలీసులు భారీగా చేరుకుని, విడదల రజిని వాహనాన్ని అడ్డుకున్నారు.

విడదల రజిని అనుచరుల్లో ఒకరైన శ్రీకాంత్‌ అనే వ్యక్తిని అరెస్టు చేస్తున్నట్లు​ పోలీసులు ఆమెకు తెలిపారు. ఎందు...