భారతదేశం, జూలై 24 -- మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంటిపై ఆదాయపు పన్ను అధికారులు సోదాలు చేపట్టినట్లు వచ్చినట్లు వార్తలు చర్చనీయాంశంగా మారాయి. మెడికల్ సీట్లపై భారీ డొనేషన్లు, ఫీజుల అక్రమాలపై ఆరోపణలు రావటంతో.. ఈ సోదాలు జరిపినట్లు ప్రచారం జరిగింది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎక్కడా ప్రకటన రాలేదు. అయితే ఈ వార్తలపై ఆయన కోడలు ప్రీతిరెడ్డి స్పందించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను పేర్కొన్నారు.

మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ, ఈడీ సోదాలంటూ వస్తున్న వార్తలపై ఆయన కోడలు ప్రితిరెడ్డి స్పందించారు. ఈడి, ఐటీ రైడ్ వార్తల్లో వాస్తవం లేదన్నారు. పాత కేసులో విచారణ కోసం వరంగల్ పోలీసులు వచ్చినట్లు తెలిపారు. వెరిఫికేషన్ ప్రాసెస్ లో భాగంగా వారు వచ్చారని. ఎలాంటి రైడ్ జరగలేదని క్లారిటీ ఇచ్చారు.

ఇక గతంలోనూ మల్లారెడ్డితో పాటు ఆయ...