భారతదేశం, జనవరి 14 -- టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే గడిచిన కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో రాబోయే ఒక రియాలిటీ షో కోసం ఈ మాజీ జంట మళ్లీ చేతులు కలపబోతున్నారని, ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్నారని నెట్టింట గుసగుసలు వినిపించాయి. దీంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ ఊహాగానాలపై చహల్ ఎట్టకేలకు మౌనం వీడాడు.

'ది 50' (The 50) పేరుతో రాబోయే ఒక కొత్త రియాలిటీ షోలో చహల్, ధనశ్రీ కలిసి పాల్గొంటున్నారని పలు రిపోర్టులు వెల్లడించాయి. విడాకుల తర్వాత వీరిద్దరూ కలిసి కనిపిస్తే అది సంచలనమే అవుతుందని నెటిజన్లు చర్చించుకున్నారు. ఫరా ఖాన్ హోస్ట్ చేయబోయే ఈ షో ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానుంది.

ఈ వార్తలపై చహల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా...