భారతదేశం, మే 25 -- పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడు జంట హత్యల ఘటనలో.. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి సోదరులపై కేసు నమోదైంది. 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఎ-1గా జవిశెట్టి శ్రీను, ఎ-2గా తోట వెంకట్రావు, ఎ-3గా తోట గురవయ్య, ఎ-4గా నాగరాజు, ఎ-5గా తోట వెంకటేశ్వర్లు, ఎ-6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎ-7గా పిన్నెల్లి వెంకట్రామి రెడ్డిని చేర్చారు.

శనివారం సాయంత్రం గుండ్లపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావును.. అదే పార్టీకి చెందిన కొందరు హత్య చేశారు. అయితే ఈ హత్యల వెనుక మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల హస్తం ఉందని.. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. చిన్న చిన్న వివాదాలను పిన్నెల్లి సోదరులు పెద్దవిగా చేసి.. హత్యలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ ...