భారతదేశం, జనవరి 21 -- మాఘ మాసం అత్యంత పవిత్రమైన మాసం. తెలుగు నెలల్లో పదకొండవ నెల. జనవరి 19 నుంచి మాఘమాసం ప్రారంభమైంది. మాఘమాసం అంటే మొట్టమొదట గుర్తొచ్చేది నది స్నానం. అయితే ఈ చలిలో నదిలో ఎందుకు స్నానం చేయాలి? దీని వెనుక పరమార్థం ఏంటి? ఇది కేవలం నమ్మకమా, లేక ఆరోగ్య రహస్యమా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మాఘ మాసంలో మాఘస్నానం చేస్తే సర్వపాపాలు తొలగిపోతాయని పెద్దలు అంటారు. మాఘ మాసంలో నది స్నానం చేస్తే ఆధ్యాత్మిక, శాస్త్రీయ ప్రయోజనాలు లభిస్తాయని చెబుతారు. పాపాలన్నీ తొలగిపోతాయి, విష్ణు అనుగ్రహం లభిస్తుంది. మాఘ మాసంలో సూర్యుడు మకర రాశిలో సంచరించినప్పుడు నదులన్నీ గంగా నదితో సమానమైన పవిత్రతను కలిగి ఉంటాయి. అందుకే మాఘ మాసంలో తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నది స్నానం చేస్తే గత జన్మ పాపాలు కూడా తొలగిపోతాయని అంటారు. అలాగే విష్ణువు అనుగ్రహాన్ని...