Hyderabad, ఆగస్టు 21 -- బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్లలో భారీ వ్యత్యాసం ఉండటంపై నటి కృతి సనన్ ఇటీవల ఒక కార్యక్రమంలో తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించింది. ఇండస్ట్రీలో మేల్, ఫిమేల్ యాక్టర్స్ ను సమానంగా చూడాలన్న డిమాండ్ ను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. చేసే పని ఒకటే అయినప్పుడు వేతనం ఎందుకు భిన్నంగా ఉండాలని ఆమె ప్రశ్నించింది.

ఆదిపురుష్ లో ప్రభాస్ తో కలిసి నటించిన కృతి సనన్ గురువారం (ఆగస్టు 21) జరిగిన సీఎన్ఎన్-న్యూస్18 కార్యక్రమంలో మాట్లాడింది. "నిజానికి అన్ని ఇతర ఇండస్ట్రీలను పరిశీలిస్తే.. వేతన వ్యత్యాసం ఇక్కడే ఎందుకు ఉందో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే కొన్ని రకాల పాత్రలకు, కొన్ని రకాల ఉద్యోగాలకు.. మీరు పురుషులు లేదా స్త్రీలు అనేది ముఖ్యం కాదు. వేతనం ఒకేలా ఉండాలి. ముఖ్యంగా సినిమాలలో.. మేము చాలా కాలంగా దీని గురించి మాట్లాడుకు...