భారతదేశం, డిసెంబర్ 11 -- తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు క్యూలో నిలబడటంతో అనేక గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 11 గంటల నాటికి 52 శాతం ఓటింగ్ నమోదైంది. పట్టణాలు, నగరాల్లో పనిచేస్తున్న చాలా మంది ఓటర్లు తమ ఓటు వేయడానికి స్వగ్రామాలకు తిరిగి వచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు, వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

అయితే కొన్ని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం చిన్న గోకుల్ తండా వాసులు ఎన్నికలను బహిష్కరించారు. తమకు సమాచారం ఇవ్వకుండానే పెద్ద గోకుల్ తండా వాసులు సర్పంచ్‌ను ఏకగ్రీవం చేశారని గ్రామస్తులు నిరసనకు దిగారు. ఎన్నిక...