భారతదేశం, నవంబర్ 15 -- ఫ్యాన్స్ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న టైమ్ ఎట్టకేలకు వచ్చింది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు 'వారణాసి' అనే పేరు పెట్టారు. ఈ చిత్రానికి వారణాసి అనే టైటిల్ ను పెడతారని ముందే నుంచే ప్రచారం సాగింది. అనుకున్నట్లుగానే ఈ టైటిల్ నే ఫిక్స్ చేశారు మేకర్స్.

మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఓ మూవీ రెడీ అవుతోంది. ఈ సినిమా టైటిల్ పై ఇన్ని రోజులూ సస్పెన్స్ నెలకొంది. శనివారం (నవంబర్ 15) గ్లోబ్‌ట్రాట‌ర్ పేరుతో ఈ సినిమా ఈవెంట్ ను హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ లోనే మూవీ టైటిల్, మహేష్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారనే టాక్ వినిపించింది. అనుకున్నట్లుగానే ఈవెంట్ స్టార్ట్ కాకముందే టైటిల్ గ్లింప్స్ ను అక్కడి స్క్ర...