భారతదేశం, డిసెంబర్ 23 -- హైదరాబాద్‌లో జరిగిన టాలీవుడ్ ప్రో లీగ్ (TPL) లాంచ్ ఈవెంట్‌లో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సందడి చేశాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్‌లపై తనకున్న అభిమానాన్ని బయటపెట్టాడు. రిటైర్ అయ్యాక తాను ఎక్కువగా వీళ్ళ సినిమలే చూస్తున్నానని సెహ్వాగ్ సరదాగా వ్యాఖ్యానించాడు.

టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా హైదరాబాద్ వచ్చాడు. దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన టాలీవుడ్ ప్రో లీగ్ (TPL) లాంచ్ ఈవెంట్‌లో అతడు పాల్గొన్నాడు. ఈ వేదికపై సెహ్వాగ్ తెలుగు సినిమాల గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

సౌత్ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన సెహ్వాగ్.. తన ఫేవరెట్ హీరో ఎవరనేది రివీల్ చేశాడు. "మహేష్ బాబు నా ఫేవరెట్ తెలుగు హీరో. ఆయనంటే నాకు చాలా ఇష్టం. అలాగే అల్లు అర్జున్, ప్...