భారతదేశం, నవంబర్ 5 -- నటి శిల్పా శిరోద్కర్ చాలా కాలం తర్వాత 'జటాధర' అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లోనటించిన ఈ మైథలాజికల్ హారర్ సినిమా ప్రమోషన్స్‌తో ఆమె బిజీగా ఉన్నారు. ప్రేమతో జరిపిన ఒక ఇంటర్వ్యూలో ఆమె తన బావ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ కు శిల్పా సోదరి.

మహేష్ బాబుకు అసూయ తెలియదని శిల్పా శిరోద్కర్ అన్నారు. ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి శిల్పను అడగ్గా, తాను ఆయనకు పెద్ద అభిమానినని చెప్పారు. "ఆయన నా కుటుంబ సభ్యుడు. నేను కలిసిన అత్యంత దయగల వ్యక్తులలో ఆయన ఒకరు. నేను మహేష్‌కు అభిమానిని. ఆయన నా బావ. నిజం చెప్పాలంటే, ఆయన అందరికీ మంచి జరగాలని కోరుకునే వ్యక్తి. ఆయనలో ఎలాంటి చెడు ఉద్దేశం, అసూయ, ద్వేషం ఉండవు'' అని శిల్పా శిరోద్కర్ చెప్పారు....