Hyderabad, ఏప్రిల్ 29 -- మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఎస్ఎస్ఎంబీ29 మూవీ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈసారి పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ లెవెల్లో జక్కన్న ఈ మూవీ తీస్తుండటంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా మహేష్ కొత్త లుక్ ఫొటోలు బయటకు వచ్చాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న నెక్ట్స్ మూవీ ఎస్ఎస్ఎంబీ29. రాజమౌళి డైరెక్షన్ లో కావడంతో ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలు ఉన్నాయి. జనవరిలోనే పూజా కార్యక్రమాలతో మూవీ షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. ఇప్పటికే ఒడిశాలో ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. అయితే తాజాగా మూవీ కోసం మహేష్ కొత్త లుక్ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

మంగళవారం (ఏప్రిల్ 29) సోషల్ మీడియాలో మహేష్ కొత్త లుక్ కు సంబంధించిన ఫొటో...