భారతదేశం, డిసెంబర్ 5 -- 'ఆర్ఎక్స్ 100', 'మహా సముద్రం', 'మంగళవారం' వంటి వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ఇప్పుడతడు మరో సంచలనానికి సిద్ధమయ్యాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ ఘట్టమనేనిని టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నాడు. ఇదే మూవీతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని కూడా తెలుగు తెరపైకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని చందేరీలో 'శ్రీనివాస మంగాపురం' షూటింగ్ జరుపుకుంటుండగా.. 'హిందుస్థాన్ టైమ్స్'తో మాట్లాడిన అజయ్ భూపతి సినిమా విశేషాలను పంచుకున్నాడు.

శ్రీనివాస మంగాపురం సినిమా గురించి అడగ్గానే తన శైలికి తగ్గట్టుగానే ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు అజయ్ భూపతి. "ఇది మీరు రోజూ చూసే రొటీన్ ప్రేమకథ కాదు" అని స్పష్టం చేశాడు. ఎక్కువ వివరాలు బయటపెట్టకుండానే.. "ఇద...