భారతదేశం, నవంబర్ 27 -- ఘట్టమనేని వంశం నుంచి మరో నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ ఘట్టమనేని తొలి సినిమాకు శ్రీనివాస మంగాపురం అనే టైటిల్ పెట్టారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ గురువారం (నవంబర్ 27) రిలీజ్ చేశారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మరో వారసుడు అడుగుపెడుతున్నాడు. అతని పేరు జయ కృష్ణ ఘట్టమనేని. మహేష్ బాబు అన్న, దివంగత నటుడు రమేష్ బాబు తనయుడు. ఆర్ఎక్స్ 100, మంగళవారంలాంటి సినిమాలతో పాపులర్ అయిన అజయ్ భూపతి డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. దీనికి శ్రీనివాస మంగాపురం అనే టైటిల్ పెట్టినట్లు గురువారం (నవంబర్ 27) వెల్లడించారు.

చేతిలో తుపాకీ పట్టుకున్న ఓ పురుషుడి చేతిని ఓ మహిళ అడ్డుకుంటున్నట్లుగా ఈ పోస్టర్ ఉంది. ఆ తుపాకీపై మూడు నామాలు ఉండటం గమనార్హం. ఆ వెను...