భారతదేశం, నవంబర్ 18 -- దర్శకుడు అజయ్ భూపతి తన తదుపరి చిత్రం గురించి అధికారికంగా ప్రకటించారు. ఇంకా పేరు పెట్టని ఈ ప్రేమకథ.. మహేష్ బాబు అన్న రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని, రవీనా టాండన్ కుమార్తె రాషా థడానిలను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేయనుంది. రాషా థడాని జయకృష్ణ ఘట్టమనేనితో కలిసి తెలుగులో అరంగేట్రం చేయనుంది.

మహేష్ బాబు అన్నయ్య, దివంగత రమేష్ బాబు కుమారుడు అయిన జయకృష్ణ టాలీవుడ్‌లో తన గ్రాండ్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నాడు. నవంబర్ 9న అజయ్ భూపతి అధికారికంగా తాను ఈ యువ నటుడి తొలి చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటించారు. ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో "ఒక గొప్ప కథతో పాటు గొప్ప బాధ్యత వస్తుంది. నా తదుపరి చిత్రం ద్వారా జయకృష్ణ ఘట్టమనేనిని పరిచయం చేయడానికి చాలా సంతోషంగా, గౌరవంగా భావిస్తున్నాను. కొండల లోతుల నుండి, ఒక సహజమైన, తీవ్రమైన, వాస్తవ...