Hyderabad, సెప్టెంబర్ 16 -- నటి లక్ష్మీ మంచు ఓ జర్నలిస్టుకు క్లాస్ పీకుతున్న వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. త్వరలో రాబోతున్న తన సినిమా 'దక్ష: ఏ డెడ్లీ కాన్స్పిరసీ' ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 19న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఈ ఇంటర్వ్యూలో తన డ్రెస్సింగ్ సెన్స్ పై జర్నలిస్టు అడిగిన ప్రశ్నపై మండిపడింది. మహేష్ బాబును ఇదే ప్రశ్న అడుగుతావా అని ఆమె అనడం గమనార్హం.

ఈ ఇంటర్వ్యూలో సదరు జర్నలిస్ట్ స్పందిస్తూ.. ముంబైకి వెళ్ళిన తర్వాత లక్ష్మీ డ్రెస్సింగ్ ఏదోలా మారిపోయిందని అన్నాడు. 50 ఏళ్లకు చేరువవుతున్న ఓ మహిళ, 12 ఏళ్ల కూతురు ఉంది.. ఇలాంటి డ్రెస్సులు వేస్తుందని అనుకుంటారు కదా అని అతడు అడిగాడు. దీనికి ఆమె స్పందిస్తూ.. తాను హైదరాబాద్‌కి తిరిగి రావడానికి ముందు అమెరికాలో కూడా ఉన్నానని చెప్పింది. తాను ఇలా కనిపించడా...