Hyderabad, మే 11 -- టాలీవుడ్‌లో కమెడియన్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వెన్నెల కిశోర్. తనదైన హావా భావాలతో, కామెడీ టైమింగ్‌తో విపరీతమైన క్రేజ్ అందుకున్న వెన్నెల కిశోర్ లేటెస్ట్‌గా నటించిన సినిమా సింగిల్. శ్రీ విష్ణు హీరోగా నటించిన సింగిల్ మూవీ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది.

సింగిల్ మూవీలో శ్రీ విష్ణుకు జోడీగా కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్‌గా చేశారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన సింగిల్ మూవీని గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ సమర్పణలో కల్యాణ్ ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. మే 9న థియేటర్లలో విడుదలైన సింగిల్ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది.

సమ్మర్‌లో కూల్ ఎంటర్‌టైనర్ మూవీ అని సింగిల్‌పై రివ్యూలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా వెన్నెల కిశోర్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస...