Hyderabad, ఆగస్టు 18 -- సూపర్ స్టార్ మహేశ్ బాబు సమర్పణలో తెరకెక్కిన సరికొత్త తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా రావు బహదూర్. హీరో సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషించిన రావు బహదూర్ సినిమాకు వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు.

కేరాఫ్ కంచరపాలెం (2018), ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య (2020) చిత్రాల తర్వాత వెంకటేష్ మహా దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా ఇది. ఈ మూవీతో రెండోసారి సత్యదేవ్‌తో వెంకటేష్ మహా కలిసి పనిచేశారు. అయితే, తాజాగా ఇవాళ (ఆగస్టు 18) రావు బహదూర్ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.

రావు బహదూర్ టీజర్ ఆద్యంతం థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. చూస్తుంటే ఈ సినిమా సైకలాజికల్, హారర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇక టీజర్‌లో మూడు డిఫరెంట్ గెటప్పులో సత్యదేవ్ కనిపించాడు. రెండు నిమిషాల 30 సెకన్లపాటు సాగిన రావు బహదూర్ టీజర్ చూపు పక్కకు తిప్పుకోని...