భారతదేశం, జనవరి 15 -- బాలీవుడ్ వెండితెరపై 'గర్ల్ నెక్ట్స్ డోర్ (పక్కింటి అమ్మాయి)' ఇమేజ్‌తో కోట్లాది మంది మనసు గెలుచుకున్న బ్యూటిపుల్ హీరోయిన్ అమృత రావు. టాలీవుడ్‌లో మహేశ్ బాబు అతిథి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అమృత రావు ఆ తర్వాత తెలుగులో మరో మూవీ చేయలేదు.

ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో అమృత రావుకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా అమృతకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. స్టార్ హీరోయిన్, సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్‌తో జ్యూవెలరీ బ్రాండ్ 'పాల్మోనాస్' (Palmonas) యాడ్‌లో అమృత మెరిశారు. ఇందులో అమృత యంగ్ లుక్ చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

బుధవారం (జనవరి 14) విడుదలైన ఈ యాడ్‌లో శ్రద్ధా కపూర్, అమృత రావు మధ్య సాగే ఫన్నీ సంభాషణ ఆకట్టుకుంటోంది. కొత్త మంగళసూత్ర కలెక్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా అమృతను...