భారతదేశం, జనవరి 4 -- మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో పోటీని మరో స్థాయికి తీసుకెళుతూ, మహీంద్రా తన సరికొత్త ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓను రేపు (జనవరి 5) మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతోంది. గతంలో ఎక్స్​యూవీ500, ప్రస్తుతం ఎక్స్​యూవీ700గా మనకు సుపరిచితమైన మోడల్‌కు ఇది అత్యాధునిక 'ఫేస్‌లిఫ్ట్' వెర్షన్. ఇప్పటికే టీజర్లతో అంచనాలను పెంచేసిన మహీంద్రా, సోమవారం ఈ కారు పూర్తి ధరలను, ఫీచర్లను అధికారికంగా వెల్లడించనుంది.

మీరు ఈ కొత్త ఫ్యామిలీ ఎస్‌యూవీని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే లాంచ్‌కు ముందే ఈ ఎస్​యూవీకి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ఇక్కడ తెలుసుకోండి..

1. ఎక్స్‌టీరియర్: మరింత పవర్‌ఫుల్ లుక్..

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ డిజైన్ చాలా బోల్డ్‌గా, స్టైలిష్​గా ఉండబోతోంది.

ముందు భాగం: రీడిజైన్ చేసిన సరికొత్త గ్రిల్, దాని పైభాగంలో స్లీక్ ఎల్‌ఈడీ డే-టైమ్ రన్నిం...