భారతదేశం, జనవరి 10 -- భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్​లో తన పట్టును కొనసాగించేందుకు మహీంద్రా సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. తన పాపులర్ మోడల్ ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఆధారంగా రూపొందించిన ఎలక్ట్రిక్ కారు 'ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఈవీ'ని మార్కెట్​లోకి విడుదల చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎక్స్​యూవీ400 కంటే తక్కువ ధరకే ఇది లభించనుంది. మరి ఈ రెండింటి మధ్య ఉన్న పోలికలు, తేడాలేంటో ఇప్పుడు చూద్దాము..

ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఈవీని చూస్తుంటే, ఇది కేవలం ఎక్స్​యూవీ400కి ఒక సమగ్రమైన 'ఫేస్‌లిఫ్ట్' వెర్షన్‌లా అనిపిస్తుంది. ఎక్స్​యూవీ400 పాత తరం ఎక్స్​యూవీ300 ఆధారంగా తయారవ్వగా, ఈ కొత్త 3ఎక్స్​ఓ ఈవీ మాత్రం అత్యాధునిక డిజైన్‌తో మెరిసిపోతోంది. ముందు భాగంలో హెక్సాగనల్ హౌసింగ్‌తో కూడిన ఎల్‌ఈడీ డీఆర్ఎల్స్​, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ దీనికి ప్రీమియం లుక్ ఇచ్చాయి. వ...