భారతదేశం, ఆగస్టు 21 -- మహీంద్రా సంస్థ తమ ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ (Mahindra XUV 3XO) ఎస్‌యూవీలో డాల్బీ అట్మాస్ (Dolby Atmos) సాంకేతికతను తీసుకొచ్చింది. దీంతో రూ. 12 లక్షల లోపు ధర ఉన్న కార్లలో డాల్బీ అట్మాస్ సపోర్ట్‌ను పొందిన ఏకైక కారుగా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ నిలిచింది. ఈ కొత్త ఫీచర్ సెప్టెంబర్ నెల మధ్య నుంచి అందుబాటులో ఉండేలా మహీంద్రా ప్రకటించింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓలో ఎంపిక చేసిన 4 వేరియంట్లలో డాల్బీ అట్మాస్ సపోర్ట్‌ను అందిస్తున్నారు. ఈ వేరియంట్లు..

ఈ అన్ని వేరియంట్లలో ఆరు స్పీకర్ల లేఅవుట్ ఉంటుంది. ఏఎక్స్‌7ఎల్ (AX7L) వేరియంట్‌లో అదనంగా సబ్‌వూఫర్ కూడా ఉంటుంది. ఇది ఆడియో అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ కోసం కొత్తగా ఆర్‌ఈవీఎక్స్‌ సిరీస్‌ను తీసుకొచ్చారు. ఇందులో రెండు ట్రిమ్ స్థాయిలు ఉన్నాయి. అవి ఎమ్ (M),...