భారతదేశం, జనవరి 11 -- ఎస్‌యూవీల రారాజు మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి మరో సంచలనం రాబోతోంది! గతేడాది ఆగస్టులో జరిగిన 'ఫ్రీడమ్_ఎన్.యూ' ఈవెంట్‌లో కంపెనీ ప్రదర్శించిన నాలుగు కాన్సెప్ట్ కార్లలో ఒకటైన 'విజన్ ఎస్' ఇప్పుడు రోడ్లపై ప్రత్యక్షమైంది. తమిళనాడులో ఈ కారును టెస్టింగ్ చేస్తున్న సమయంలో కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్​లో పోస్ట్ చేశారు. ఫలితంగా ఈ కారుకు సంబంధించి కొత్త విషయాలు బయటకు వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

మహీంద్రా విజన్.ఎస్, విజన్.ఎస్​ఎక్స్​టీ, విజన్​.టీ, విజన్.ఎక్స్ అనే నాలుగు రకాల కాన్సెప్ట్ ఎస్‌యూవీలను గత ఆగస్టులో పరిచయం చేసింది మహీంద్రా. ఇవన్నీ కూడా మహీంద్రా కొత్తగా రూపొందించిన 'ఫ్రీడమ్_ఎన్.యూ' మోనోకాక్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి తయారయ్యాయి. ఈ ప్లాట్‌ఫామ్ విశేషం ఏంటంటే.. దీనిపై పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజ...