భారతదేశం, నవంబర్ 2 -- భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తమ కొత్త 7 సీటర్ ఎలక్ట్రిక్ ఎస్​యూవీని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది! ఈ రాబోయే మూడు వరుసల ప్రీమియం ఈవీ శ్రేణికి ఎక్స్​ఈవీ 9ఎస్​ అని కంపెనీ అధికారికంగా నామకరణం చేసింది.

ఈ సరికొత్త వాహనాన్ని ప్రత్యేకంగా ఎలక్ట్రిక్​ వాహనాల కోసం రూపొందించిన INGLO ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారు చేస్తున్నారు. అదనపు వరుస సీట్లను సర్దుబాటు చేసేందుకు, ఇప్పటికే ఉన్న ఎక్స్​ఈవీ 9ఈ మోడల్ కంటే దీని వీల్‌బేస్ పొడవుగా రూపొందించారు.

INGLO స్కేట్‌బోర్డ్ నిర్మాణం ఆధారంగా తయారు చేసిన మూడొవ వాహనం ఈ ఎక్స్​ఈవీ 9ఎస్! ప్రస్తుతం, ఇదే నిర్మాణంలో బీఈ 6, ఎక్స్​ఈవీ 9ఈ మోడళ్లు ఉన్నాయి.

అయితే ఈ కొత్త ఎక్స్​ఈవీ 9ఎస్​ అనేది ఇప్పటికే ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​గా ఉన్న మహీంద్రా ఎక్స్​యూవీ700కి ఎలక్ట్రిక్​ వర్షెన్​ అయ్...