భారతదేశం, ఆగస్టు 22 -- మహీంద్రా సంస్థ విద్యారంగానికి ఇస్తున్న ప్రోత్సాహం గురించి చాలా మందికి తెలుసు. అందులో భాగంగానే, కె.సి. మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ (KCMET) ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులకు మహీంద్రా ఆల్ ఇండియా టాలెంట్ స్కాలర్‌షిప్ (MAITS) ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఈ స్కాలర్‌షిప్ చాలా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఉన్నాయి.

ఎవరికి?: ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు.

ఎంత ఇస్తారు?: ఎంపికైన 550 మంది విద్యార్థులకు మూడేళ్ల పాటు ఏటా రూ. 10,000 చొప్పున మొత్తం రూ. 30,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది.

10వ, 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షల్లో 60% కన్నా ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి.

ప్రభుత్వ లేదా గుర్తింపు ...