భారతదేశం, నవంబర్ 23 -- మహీంద్రా అండ్​ మహీంద్రాకు చెందిన బెస్ట్​ సెల్లింగ్​, 7 సీటర్​ ఫ్యామిలీ ఎస్​యూవీ ఎక్స్​యూవీ700కి త్వరలోనే ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ రాబోతోంది. తాజాగా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ప్రొడక్షన్​ వచ్చే నెల, అంటే డిసెంబర్ 2025లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2026లో ఈ మోడల్​ లాంచ్​ అవ్వొచ్చు! కాగా ప్రస్తుత తరం ఎక్స్​యూవీ700 మోడల్ ఉత్పత్తి నవంబర్ 2025 తో నిలిచిపోనుందని తెలుస్తోంది.

కొత్త ఎక్స్​యూవీ700 ఫేస్‌లిఫ్ట్‌ ఇప్పటికే భారత దేశ రోడ్లపై టెస్టింగ్​ దశలో కనిపించింది. ఈ ఎస్​యూవీ టెస్ట్​ మోడల్​కి సంబంధించిన స్పై షాట్‌ల ద్వారా కొన్ని ఆసక్తికరమైన వివరాలు వెల్లడయ్యాయి.

ఎక్స్​టీరియర్​: ఈ కొత్త ఎస్​యూవీకి పూర్తిగా కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, కొత్త 'ట్విన్-పాడ్ ఎల్​ఈడీ హెడ్‌ల్యాంప్స్', సరికొత్త సిగ్నేచర...