భారతదేశం, డిసెంబర్ 2 -- హైదరాబాద్ మెట్రో రైలు మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల భద్రత కోసం 20 మంది ట్రాన్స్ జెండర్ సిబ్బందిని భద్రతా సేవల్లో చేర్చుకున్నట్లు ప్రకటించింది. ఇండక్షన్ సెక్యూరిటీ శిక్షణ పూర్తయిన తరువాత 20 మందిని ఎంపిక చేసింది. ఆయా సిబ్బందిని ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లతో పాటు మెట్రో రైళ్లలో విధులు నిర్వర్తించడం ప్రారంభించారని హైదరాబాద్ మెట్రో రైల్ ఒక ప్రకటనలో తెలిపింది.

"ట్రాన్స్ జెండర్ సిబ్బందిని భద్రతా సిబ్బందిలోకి చేర్చడం సామాజిక సాధికారత మరియు సమ్మిళితత్వానికి బలమైన చిహ్నంగా నిలుస్తుంది. మెట్రో రైలు వ్యవస్థపై మహిళల భద్రత మరియు ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన అడుగు" అని హైదరాబాద్ మెట్రో పేర్కొంది.

కొత్తగా నియమితులైన ట్రాన్స్‌జెండర్ సిబ్బంది. మహిళలకు ప్రత్యేకంగా కేటాయించిన కోచ్‌లతో పాటు ఇతర సాధారణ కోచ్‌లలో...