Hyderabad, ఏప్రిల్ 11 -- ఇంటిపనుల్లో స్త్రీలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యే ఇది. రోజు మొత్తంలో చాలాసేపు నిలబడి పనిచేయడం వల్ల వెన్నునొప్పితో ఎక్కువగా బాధపడతారు. అంతేకాదు పాదాలపై నిలబడి ఎక్కువసేపు ఉండటం వల్ల మంటలు పెరిగి వంట చేయడం, పాత్రలు కడగడం చాలా కష్టంగా ఉంటుంది. కొందరిలోనైతే నడుం భాగం బిగుసుకుపోయినట్లు మారిపోతుంది. అటువంటి వారు కాసేపు కూర్చొన్నా వెన్నునొప్పి విపరీతంగా వేధిస్తుంటుంది. ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాలంటే, పనిచేసే సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. శరీర భంగిమను అనుకూలంగా ఉంచుకుని పనులు చేసుకోవడం వల్ల నడుంనొప్పి తీవ్రత ఎక్కువగా ఉండదు.

నిలబడి పనిచేయడం వల్ల చాలా మంది స్త్రీలకు వెన్నునొప్పి కలుగుతుంది. దీనికి కారణం తప్పుడు భంగిమలో ఉండి పనిచేయడమే. వంట తయారు చేసేటప్పుడు, పాత్రలు కడుక్కేటప్పుడు ఈ నొప్పి తీవ్రత పెరుగుతుంది. ఎందుకంటే, ...