Telangana, జూలై 18 -- ఇందిరా మహిళాశక్తి సంబరాల్లో భాగంగా రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలను అందిస్తున్నారు. ఇప్పటికే ఈ స్కీమ్ పై తెలంగాణ సర్కార్ ప్రకటన కూడా చేసింది. అంతేకాకుండా ఈ పథకం అమలు కోసం రూ.344 కోట్లను విడుదల చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చెక్కులను కూడా అందజేస్తున్నారు.

స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలను తీసుకుంది.ఇందుకోసం ఇందిరా మహిళాశక్తి ద్వారా వివిధ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ప్రధానంగా బ్యాంక్‌ల ద్వారా రుణాలిస్తూ వారు ఆర్థికంగా ముందడుగు వేసేలా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే. మహిళలకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేస్తోంది. అయితే ఈ స్కీమ్ ను ఎలా అమలు చేస్తారు..? రుణాల చెల్లింపు ఎలా ఉంటుంది..? వంటి ముఖ్యమైన అంశాలను ఇక్కడ తెలుసుకోండ...