భారతదేశం, డిసెంబర్ 29 -- హైదరాబాద్ సీపీ సజ్జనర్ తన ఎక్స్ ఖాతాలో మహిళలకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. అది ఏంటంటే.. మహిళలకు ఉచితంగా డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. బైక్ టాక్సీ, ఈ-ఆటో నడపాలనుకునే మహిళలకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. మహిళలకు ఉపాధి లక్ష్యంగా ఈ ట్రైనింగ్ ఉంటుంది.

స్టీరింగ్ పట్టండి.. స్వశక్తితో ఎదగండి అంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం, హైదరాబాద్ పోలీసుల సహకారంతో డ్రైవర్ ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది. మహిళల భద్రత, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా బైక్ టాక్సీ, ఈ-ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు.

పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (PTC), అంబర్‌పేట్, హైదరాబాద్‌లో మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తారు. జనవరి 3 (శుక్రవారం) ఉదయం 10.30 నుంచి 1 గంట వరకు హాజరు...