భారతదేశం, మే 17 -- ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది. కర్నూలు పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు.. ఈ మేరకు ప్రకటించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ పథకం వర్తిస్తుందని చెప్పారు. రైతుల అకౌంట్‌లలో ఏటా రూ.14 వేలు చొప్పున వేస్తామన్న చంద్రబాబు.. కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రూ.8 వేలు ఇస్తామని ప్రకటించారు. రాయలసీమను హార్టీకల్చర్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. ఓర్వకల్‌కి రైల్వే ట్రాక్‌ తీసుకొస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీ క్యాంప్ రైతుబజార్‌కు సీఎం వెళ్లారు. అక్కడ రైతులు, పారిశుద్ధ్య కార్మికుల...