Hyderabad, జూలై 6 -- ప్రకృతి కొండల నడుమ, గలగలపారే సెలయేరు పక్కన వెలసిన శ్రీ మద్దులేటి నరసింహస్వామి దేవస్థానం ప్రముఖ వైష్ణవక్షేత్రంగా విరాజిల్లుతోంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఆలయ స్థలపురాణం ప్రకారం ఒకరోజు శ్రీ స్వామి, అమ్మవార్లు ఆనందంగా పాచికలు ఆడుతున్నారు.

శ్రీ స్వామివారిపై అమ్మవారు విజయం సాధించి, విజయగర్వంతో స్వామివారివంక చూశారు. అందుకు స్వామి అలకబూని, ఎర్రమల, నల్లమల కొండలు సంచరించి చివరకు శ్రీ యాగంటి క్షేత్రానికి వచ్చి శ్రీ ఉమామహేశ్వర స్వామి వారిని సంప్రదించి, అయ్యా! నేను ఎర్రమల కొండలలో వెలసి భక్తుల కోర్కెలు తీరుద్దామనుకుంటున్నాను, నాకు ఒక మంచి ప్రదేశాన్ని చూపించండి" అని కోరారు.

యాగంటి శ్రీ ఉమామహేశ్వరస్వామివారు మద్దులేరు వాగు పక్కన ప్రకృతి రమణీయ ప్రశాంత వాతావరణ ప్రదేశం...