భారతదేశం, మే 10 -- ఆ అధికారి పేరు అర్రామ్ రెడ్డి అమరేందర్. సిరిసిల్ల ఇరిగేషన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. తాజాగా ఆయన్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుబడిన తర్వాత కూడా అతను దర్జాగా సోఫాలో కూర్చొని కనిపించాడు. అతని వ్యవహార శైలిని చూసి అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సదరు అధికారి ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

మే 9వ తేదీ.. సమయం రాత్రి 8 గంటలు. ప్రాంతం కరీంనగర్ లోని విద్యారణ్యపురి. అది ఓ అవినీతి అధికారి ఇల్లు. ఆ ఇంట్లో అవినీతి ఆఫీసర్ ఒక కాంట్రాక్టర్ నుండి రూ. 60,000 లంచం తీసుకున్నాడు. అప్పటికే అక్కడ కాపుకాసిన ఏసీబీ అధికారులు.. రంగంలోకి దిగారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

రాజన్న సిరిసిల్లలోని వెంకటాపూర్ మండలంలోని అవునూరు, అగ్రారాం గ్రామాల మధ్య చెక్ డ్యామ్‌ను నిర్మించారు. దీనికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న రూ....