Hyderabad, సెప్టెంబర్ 29 -- ప్రతి ఒక్కరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని అనుకుంటారు. అందుకోసం వివిధ రకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు. సరస్వతి దేవి అనుగ్రహం కలగడానికి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి, వ్యాపారాలు చేసే వారికి ఈ స్తోత్రం బాగా హెల్ప్ అవుతుంది. మహా మహిమాన్విత స్తోత్రం ఇది. ఈ స్తోత్రం చదవడం వలన విద్యలో కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది.

చాలా మంది విద్యార్థులు ఎంత చదివినా పరీక్షల్లో గుర్తు పెట్టుకోలేకపోతుంటారు. అలాంటి వారు ఈ స్తోత్రాన్ని చదువుకుంటే చదువులో బాగా రాణిస్తారు. అష్టమి, నవమి, దశమి తిధుల్లో చదివితే మరీ మంచిది. ఆరు నెలలు ఈ స్తోత్రాన్ని చదివితే సిద్ధి పొందవచ్చు. ఎటువంటి కార్యమైనా సరే నిర్విఘ్నంగా పూర్తవుతుంది.

ఒకవేళ జాతకంలో బుధుడు స్థానం బలహీనంగా ఉన్నా, బుధ దశ జరుగుతున్నా చదివితే అద్భుతమైన ఫలితాలని చూడచ్చు. నీల సరస్వతీ స్త...