భారతదేశం, నవంబర్ 25 -- 2025లో టాక్ ఆఫ్ ది సినిమాగా మారిన చిత్రం మహావతార్ నరసింహా. ఈ యానిమేటెడ్ మూవీ రికార్డులు కొల్లగొట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇప్పుడీ చిత్రం మరో చరిత్ర నమోదు చేసింది. ఆస్కార్ రేసులో నిలిచింది. ఆస్కార్ 2026కు నామినేట్ అయిన యానిమేటెడ్ సినిమాల్లో మహావతార్ నరసింహా కూడా ఉంది.

యానిమేటెడ్ సినిమా మహావతార్ నరసింహ మరో రికార్డు ఖాతాలో వేసుకుంది. ఆస్కార్ కు నామినేట్ అయిన ఇండియన్ ఫస్ట్ యానిమేటెడ్ మూవీగా ఇది నిలిచింది. ఆస్కార్ వాళ్లు తాజాగా ప్రకటించిన యానిమేటెడ్ సినిమాల నామినేషన్ల లిస్ట్ లో మహావతార్ నరసింహా కూడా చోటు దక్కించుకుంది. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డు కోసం 35 సినిమాలు పోటీపడుతున్నాయి.

మహావతార్ నరసింహ యానిమేటెడ్ సినిమాను హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. కేజీఎఫ్, సలార్ లా...