Hyderabad, జూలై 10 -- కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార వంటి సినిమాలతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. ఇప్పుడు హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ నుంచి రూపొందిన లేటెస్ట్ మూవీ మహావతార్ నరసింహ.

ఇండియన్ మైథలాజికల్ యానిమేషన్ మూవీగా తెరకెక్కిన మహావతార్ నరసింహాను విజువల్ వండర్, శక్తివంతమైన కథనంతో ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా తీర్చిదిద్దారు మేకర్స్. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహావతార్ నరసింహ ట్రైలర్ ఐదు భాషల్లో రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ప్రారంభం నుంచి చివరి వరకు అత్యద్భుతంగా ఉంది.

బ్రహ్మ దేవుడి వరం కోసం హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేసే సీక్వెన్స్‌తో మొదలైన మహావతార్ నరసింహ ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. బ్రహ్మదేవుడి వరాన్ని హిరణ్యకశిపుడు పొందడం, ప్రజలను హింసించడం, తన ఇంట్లోనే విష్ణువుపై భక్తిత...