Hyderabad, ఆగస్టు 16 -- ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ దూసుకుపోతోంది పౌరాణిక యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహా. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార వంటి సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో తెరకెక్కిన సినిమా ఇది.

క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ నుంచి వచ్చిన మహావతార్ నరసింహ ఇండియన్ మైథలాజికల్ యానిమేషన్ మూవీగా తెరకెక్కింది. ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. జూలై 25న సైలెంట్‌గా థియేటర్లలో విడుదలైంది మహావతార్ నరసింహా సినిమా.

అయితే, థియేట్రికల్ రిలీజ్ అయినప్పటి నుంచి కేవలం మౌత్ టాక్‌తోనే అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటోంది మహావతార్ నరసింహా మూవీ. ఈ సినిమాను సౌత్, నార్త్ ఆడియెన్స్ చూస్తూ తెగ ప్రశంసిస్తున్నారు. ఇక తాజాగా మహావతార్ నరసింహా సినిమాను ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు వీక్షించి రివ్యూ ...