Hyderabad, ఆగస్టు 11 -- మహావతార్ నరసింహా 17 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్: అశ్విన్ కుమార్ తెరకెక్కించిన పౌరాణిక యానిమేటెడ్ చిత్రం మహావతార్ నరసింహ భారతదేశంలో మరో విజయవంతమైన వారాన్ని చూసింది. రక్షాబంధన్ వీకెండ్‌లో ఈ చిత్రం ఇండియాలో రూ.150 కోట్లు దాటేసింది.

ప్రపంచ బాక్సాఫీస్ వద్ద మహావతార్ నరసింహా ఇప్పుడు రూ.200 కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. మహావతార్ నరసింహా 17వ రోజు అయిన ఆదివారం (ఆగస్ట్ 10) ఇండియాలో రూ. 23.5 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే, 16వ రోజుతో పోలిస్తే 17వ రోజున 14.63 శాతం కలెక్షన్స్ పెరిగాయి.

ఇక ఇండియా వ్యాప్తంగా 17 రోజుల్లో మహావతార్ నరసింహా సినిమాకు రూ. 169.65 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి రూ. 35.15 కోట్లు, హిందీ నుంచి రూ. 126.9 కోట్లు, కర్ణాటక ద్వారా 4.94 కోట్లు, తమిళంలో 2.24 కోట్లు, మలయా...