భారతదేశం, ఏప్రిల్ 19 -- 2005లో రాజకీయ విబేధాలతో విడిపోయిన ఠాక్రే కుటుంబం చివరకు తమ విభేదాలను పక్కన పెట్టనున్నారా? రాజకీయంగా ఠాక్రే కుటుంబానికి మునపటి ప్రజాదరణ సంపాదించడానికి ఒక్కటవబోతున్నారా? వారి మెగా రీయూనియన్ గురించి మహారాష్ట్రలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

మరాఠీ అస్తిత్వానికి, సంస్కృతికి ముప్పు పొంచి ఉందన్న వాదనల నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ థాక్రే ఇద్దరూ మళ్లీ కలిసి పనిచేయాలనే ఆకాంక్షను వేరు వేరు సందర్భాల్లో వ్యక్తం చేశారు. ఇటీవలి రోజులలో వివిధ సందర్భాల్లో మాట్లాడిన శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే తమ ఉమ్మడి లక్ష్యాన్ని వెల్లడించారు. తమ విబేధాల కన్నా మహారాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని వారు స్పష్టం చేశారు. అందుకోసం తమ మధ్య విబేధాలను పక్కన పెట్టడానికి సిద్ధమేనని వ్యాఖ్యానించారు.

నటుడు, దర్శకుడు మహేష...