భారతదేశం, డిసెంబర్ 25 -- మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు మృతి చెందారు. చంద్రపూర్ జిల్లాలోని దేవదా తహసీల్‌లోని సోండో గ్రామ శివార్లలోని వంతెన పై నుంచి వాగులోకి కారు దూసుకెళ్లడంతో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన ముగ్గురు మహిళలు, ఒక బాలిక అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

కాగజ్‌నగర్ పట్టణంలోని నిజాముద్దీన్ కాలనీకి చెందిన జకీర్ భార్య సల్మా బేగం, వారి కుమార్తె షబ్రీమ్, బంధువులు అఫ్జా బేగం, సహారలు నాగ్‌పూర్‌లోని ఆసుపత్రికి వెళ్లారు. తిరిగి వస్తుండగా సోండో గ్రామ శివార్లలోని వంతెన పై నుంచి కారు పడింది. దీంతో కారు కింద చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో నలుగురు అక్కడికక్కడే మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు బంధు...