భారతదేశం, జూన్ 12 -- మహాభారతం తర్వాత నటన నుంచి రిటైర్ అవుతాననే పుకార్లను నటుడు అమీర్ ఖాన్ కొట్టిపారేశారు. ఈ ఊహాగానాలు ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ నుండి వచ్చాయి. అయితే తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమిర్ తాజాగా తెలిపారు. జూమ్‌లో ఫ్యాన్ క్లబ్ ఈవెంట్ లో ఆమిర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యాక్టింగ్ లో కొనసాగుతానని చెప్పారు.

ప్రస్తుతానికి నటన నుండి వైదొలగే ఆలోచన లేదని ఆమిర్ ఖాన్ స్పష్టం చేశారు. "మహాభారతం నా చివరి సినిమా కాదు. ఇప్పుడు సమస్య ఏమిటంటే మీరు ఏమి చెప్పినా, దాని తప్పుడు అర్థం ఎల్లప్పుడూ బయటకు వస్తుంది. మీకు ఇంకే పని చేయాలని అనిపించని ఏదైనా సినిమాలో యాక్ట్ చేయమని అడిగారు. అప్పుడు అది ఏ సినిమా అవుతుంది. మహాభారతం నా చివరి సినిమా అని ప్రజలు భావించారు. సమాధానాన్ని జాగ్రత్తగా వినాలి'' అని ఆమిర్ ఖాన్ పేర్కొన్నారు.

ఆమిర్ తన కలల ప్రాజెక్ట్ మ...