భారతదేశం, జూలై 8 -- స్మృతి ఇరానీ మళ్లీ తెరపై కనిపించనున్నారు. రాజకీయాల కారణంగా కొంత కాలం పాటు సీరియల్స్, సినిమాలకు దూరమైన ఆమె మళ్లీ మేకప్ వేసుకున్నారు. ఐకానిక్ టెలివిజన్ షో క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్ రీబూట్ తో తిరిగి బుల్లితెరపై ఆమెను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీరియల్ లో తులసీ విరానీగా నటిస్తున్న స్మృతి ఇరానీ ఫస్ట్ లుక్ లీకైంది.

తులసీ విరానీగా ఫస్ట్ లుక్ లో స్మృతి ఇరానీ మెరూన్ చీర ధరించి రిచ్ జరీ బోర్డర్ తో కనిపించారు. పెద్ద ఎరుపు బొట్టు, సంప్రదాయ ఆభరణాలు, నలుపు పూసలతో కూడిన మంగళసూత్రంతో ఆమె తన లుక్ ను పూర్తి చేశారు. 15 ఏళ్ల తర్వాత స్మృతి మళ్లీ సీరియల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.

క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్ హిందీలో పాపులర్. బాలాజీ టెలీఫిల్మ్స్ పతాకంపై ఏక్తా కపూర్ నిర్మించిన ఈ షో 3 జూలై 2000 నుంచి ...