భారతదేశం, ఆగస్టు 16 -- ఓవైపు కస్టమర్ బేస్ రోజురోజుకు పెరుగుతూ ఉంటే మరోవైపు స్విగ్గీ ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచేసింది. రోజూ ఆర్డర్ల సంఖ్య పెరుగుతుంది. స్విగ్గీ తన ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచింది. కంపెనీ ఇప్పుడు ప్రతి ఫుడ్ డెలివరీ ఆర్డర్ మీద రూ .14 వసూలు చేస్తోంది. గతంలో స్విగ్గీ ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.12 ఉండేది. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం స్విగ్గీ 2 రూపాయలు పెరిగింది.

ఈ నిర్ణయం వినియోగదారులపై చాలా తక్కువ ప్రభావాన్ని చూపినప్పటికీ, ప్రతి ఆర్డర్‌పై అదనంగా రూ .2 పొందడం కంపెనీలకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా అవుతుంది. ఏప్రిల్ 2023లో స్విగ్గీ మొదట తన వినియోగదారుల నుండి ప్లాట్‌ఫామ్ ఫీజులను వసూలు చేయడం మెుదలుపెట్టింది. దీని తరువాత కంపెనీ క్రమంగా ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచుతూ వచ్చింది. రూ.2 నుంచి మెుదలై ఇప్పుడు రూ.14 వరకు వచ్చ...