భారతదేశం, ఫిబ్రవరి 20 -- టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య మళ్లీ ప్రేమలో పడ్డాడు. అవును.. ఇది నిజమే. తన గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మ 25వ పుట్టిన రోజు సందర్భంగా ఆమెపై హార్దిక్ తన ప్రేమను కురిపించాడు. ప్రియురాలికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ రొమాంటిక్ వీడియోను పోస్టు చేశాడు.

మహికా శర్మ 25వ పుట్టినరోజు సందర్భంగా క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఆమె కోసం ఒక ప్రత్యేక పోస్ట్ షేర్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో రొమాంటిక్ వీడియో షేర్ చేశాడు. ఈ వీడియోలో మహికా, హార్దిక్ మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, కౌగిలించుకుంటూ, చేతులు పట్టుకుని బయట కూర్చున్నారు. వెనకాల బాణాసంచా వెలుగులు కనిపించాయి. వీడియో చివరిలో ఇద్దరూ గాలిలో ఎగిరే దీపాన్ని వదిలారు.

"హ్యాపీ బర్త్ డే మై ప్రిన్సెస్. 25 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచంలోకి వచ్చినందుకు నీకు ధన్యవాదాలు. నాకు తెలిసిన అత్యంత అ...