భారతదేశం, జనవరి 21 -- తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఏడాదిన్నర తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను ప్రారంభిస్తానని ప్రకటించారు. అలా ఏడాదిన్నరపాటు ప్రజల్లోనే ఉంటానని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి మిగిలి ఉంది మూడేళ్లు అని తెలిపారు.

సంకీర్ణ ప్రభుత్వం వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందని జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. 'ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పాలనా వ్యవస్థలన్నీ బలహీనపడ్డాయి. ప్రభుత్వం సమాజంలోని ఏ వర్గానికీ ప్రయోజనం చేకూర్చడం లేదు. ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది, ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంతో పోలికలు చేయడం సర్వసాధారణమైంది.' అని జగన్ అన్నారు.

సంకీర్ణ ప్రభుత్వం ఏకపక్ష పాలనకు పాల్పడుతో...