భారతదేశం, డిసెంబర్ 6 -- తమిళ అగ్ర హీరో ధనుష్, బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ తొలిసారి జోడీ కట్టి నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ తేరే ఇష్క్ మే. నవంబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను తెలుగులో అమర కావ్యం అనే టైటిల్‌తో రిలీజ్ చేశారు.

విడుదలైన తొలి రోజు నుంచి కలెక్షన్స్‌లలో జోరు చూపించిన తేరే ఇష్క్ మే సినిమా మరోసారి వెనుకంజ వేసింది. అంటే మళ్లీ బాక్సాఫీస్ వద్ద తేరే ఇష్క్ మే కలెక్షన్స్ తగ్గిపోయాయి. విడుదలైన తొలి 7 రోజుల్లో భారతదేశంలో తేరే ఇష్క్ మే రూ. 83.65 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా.

ఈ వారం రోజుల తేరే ఇష్క్ మే కలెక్షన్స్‌లలో హిందీ నుంచి రూ. 79.75 కోట్ల కలెక్షన్స్ ఉంటే తమిళం ద్వారా మాత్రం రూ. 3.9 కోట్ల వసూళ్లు ఉన్నాయి. అంటే ధనుష్ సొంత సినీ ఇండస్ట్రీ తమిళం నుంచి కంటే హిందీ బెల్డ్ ద్వారానే అధిక కలెక్షన్స్ వస...