భారతదేశం, జనవరి 12 -- మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా భర్తమహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమాలో రవితేజకు జోడీగా డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ ఇద్దరు హీరోయిన్స్ నటించారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు.

సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం జనవరి 13న సంక్రాంతి కానుకగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ భర్త మహాశయులక విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో రవితేజ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.

మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, నేను కలిసి 13 సినిమాలు చేశాం. మా సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. ఈ సినిమాలో మా హీరోయిన్స్ చాలా అందంగా కనిపిస్తారు. నన్న...